Share News

పేదలకు మెరుగైన వైద్యం..

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:51 AM

నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం..

ఇల్లంతకుంట, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మం డలకేంద్రంలో నిర్మాణంలో ఉన్న 50పడకల ఆసుపత్రి భవన నిర్మా ణ పనులను మంగళవారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఆసుపత్రి భవన ని ర్మాణానికి రూ.12కోట్లు, ఆసుపత్రిలో పరికరాల ను రూ.5కోట్లు కేటాయించిందన్నారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వర లోనే అందుబాటులోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొ న్నారు. గ్రామీణ ప్రాంతాలలోను కార్పోరేట్‌ వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తుంద న్నారు. ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న గదుల ను పరిశీలించి, పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నియోజ కవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి అధికంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమ లవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి పనులు సామాంతరంగా జరుగుతు న్నాయన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, పీసీసీ కోఆర్డీనేటర్‌ పాశం రాజేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీగల పుష్పలత, నియోజకవర్గ అధికార ప్రతిని ధి పసుల వెంకటి, ఫ్యాక్స్‌వైస్‌చైర్మన్‌ యాస తిరుపతి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎలుక రామస్వామి, నాయకులు మహేందర్‌ రెడ్డి, చిట్టి ఆనందరెడ్డి, అంతగిరి వినయ్‌కు మార్‌, కాత మల్లేశం, నేరెళ్ళ విజయ్‌, మేడిపెల్లి భాస్కర్‌రెడ్డి, అంతగిరి, కడగండ్ల తిరుపతి, మం ద బాల్‌రెడ్డి, బడుగు లింగం, నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మండలపరిషత్‌ కార్యాలయంలో సీఎం సహా యనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. మండలంలో ని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం రూ.25లక్షల 46వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ఫ్యాక్స్‌చైర్మన్‌ వుట్కూరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:51 AM