Share News

శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు మెరుగైన ఆదాయం

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:56 PM

శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతు లకు మెరుగైన ఆదాయం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు మెరుగైన ఆదాయం

చందుర్తి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతు లకు మెరుగైన ఆదాయం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడ, బాబు జగ్జీవన్‌ రామ్‌ సిరిసిల్ల, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసా య కళాశాల పొలాస విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లా డుతూ భూమితో అనుబంధం కలిగి వ్యవసాయ, వెటర్నరీ విద్యను అభ్యసి స్తూ భవిష్యత్తులో రైతులకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న విద్యార్థులను అభినందించారు. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, నేల స్వభావం, నేల సారాన్ని పరిశీలించి ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, సర్పంచ్‌ చిలుక మల్లేశ్వరి-అంజిబా బు, రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, వైస్‌ చైర్మన్‌ బొజ్జ మల్లేశం, సింగిల్‌విండో చైర్మన్లుగసికంటి ప్రభాకర్‌, ఎగోళం శ్రీనివాస్‌, కోఆ ర్డినేటర్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌. సాయికుమార్‌, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె. సురేష్‌, మండల వ్యవసాయ అధికారి దుర్గారాజు, అధ్యాపకులు బి. శ్వేత, రజియా సుల్తానా, సతీష్‌, మాజి జడ్పిటిసి సభ్యుడు నాగం కుమార్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఆర్‌ఏడబ్ల్యుఈపి విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:56 PM