Share News

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:55 PM

గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నా రు.

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం

చందుర్తి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మం గళవారం మొబైల్‌ ఎక్స్‌రేను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త్‌ భారత్‌లో భాగం 24 లక్షలతో మొబైల్‌ ఎక్స్‌రేను అందుబాటులోకి తెచ్చామన్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఈ పరికరం ఉపయోగ పడుతుందన్నారు. జిల్లా పరిధిలోని గుర్తింపు పొందిన టీబీ రోగులకు మొబైల్‌ ఎక్స్‌రేల ద్వారా ఆయాప్రాంతాల్లో వైద్యం అందించేందుకు వారి ఇంటికి వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. గ్రామాల్లోకి వెళ్లి టీబీ రోగులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. నూత న టెక్నాలజీ ద్వారా వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అంది స్తుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో పేదలకు వైద్య సేవ లందిస్తున్నట్లు తెలిపారు. వేములవాడలోని వంద పడకల ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిమ్స్‌ను ఆధునీకరిస్తు న్నామని, నయా ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్న ట్లు తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రులలను సద్వి నియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:55 PM