ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:59 PM
విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదు వులో మంచి ఫలితాలు సాధించగలరని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు.
ముస్తాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదు వులో మంచి ఫలితాలు సాధించగలరని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. ముస్తాబాద్ పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో శ్రీ తిరుమల నర్సింగ్ నర్సింగ్ హోమం, సిద్దిపేట సురభి మెడికల్ కళాశాల సౌజన్యంతో మండల కేంద్రం లోని పోలీసు ఠాణాలో సిబ్బందికి, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి విద్యార్థుల పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణులు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మహేశ్ బి గీతే మాట్లాడు తూ చిన్న వయస్సులోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే జీవితంలో విజయాలు సాధ్యమవుతా యన్నారు. చదువుతోపాటు మంచివిలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం పెరుగున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనూమానాస్పద లింకులు, ఫోన్‌కాల్స్, సోషల్‌మీడియా మోసాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత వీడియో మెసేజ్‌ల ద్వారా మోసం చేస్తున్నారన్నారు. వాటిపై అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. వ్యక్తిగత విషయాలు సామా జిక మాధ్యమాల్లో పంచుకో వద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలి పారు. సైబర్‌నేరాలకు మోస పోయిన వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ మాజీ మెంబర్ డాక్టర్ ఎర వెల్లి చంద్రశేఖర్‌రావు, సీఐ మోగిలి, ఎస్సై గణేశ్, సెస్ డెరెక్టర్ అంజిరెడ్డి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మండల అధ్యక్షులు బాల్‌రెడ్డి, సురేందర్‌రావు, సౌల్ల క్రాంతికుమా ర్, తిరుమల నర్సింగ్‌హోం యాజమాన్యం, సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది, ఎంఈవో రాజిరెడ్డి, డాక్టర్ శ్రీకాం త్, డాక్టర్ అనురాధ,డాక్టర్ స్రవంతి, తదితరులున్నారు.