Share News

ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఫలాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:37 PM

నియోజకవర్గంలోని ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నానని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.

ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఫలాలు

బోయినపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నానని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని వివిధ కుల సంఘాలకు అభివృద్ధి పను లకు రూ 46లక్షల 75 వేల ప్రొసీడింగ్‌ పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంఘాలు అభివృద్ధి చేసినప్పుడే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతా యన్నారు. నిధులను సద్వినియోగం చేసుకుని సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ ముందుగంటి సురేందర్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కొట్టేపల్లి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ బోయిని ఎల్లేష్‌ యాదవ్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్‌ యాదవ్‌, సర్పంచ్‌లు బింరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, నల్ల మోహన్‌, నాయకులు నాగుల వంశీ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:37 PM