సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి
ABN , Publish Date - May 02 , 2026 | 11:23 PM
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
తిమ్మాపూర్, మే2(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరిగిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్ధాయి సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, పథకాలన్నీ పేదల దరికి చేరాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేపట్టబోయో పథకాలు, పనులపై ప్రజలకు తెలియ జేయాలనే ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల పాటు సభలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. మానకొండూర్‌లో నిర్మాణంలో ఉన్న 50పడకల అసుపత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నదని తెలిపారు. యాదపులపల్లెలో 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెస్షియల్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసా య కళాశాలను కూడా నియోజకవర్గానికి మంజురు చేయించుకోగలిగామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం తిమ్మాపూర్ మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయధికారి భాగ్యలక్ష్మి, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, సురేఖ, కనకయ్య, శ్రీకాంత్, సురేష్, ఎంపీడీవోలు రాజీవ్ మల్హోత్ర, వరలక్ష్మి, కృష్ణా ప్రసాద్, ప్రవీణ్ పాల్గొన్నారు.