Share News

సంక్షోభంలో బీడీ పరిశ్రమలు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:39 AM

బీడీ పరిశ్ర మలను సంక్షోభంలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టుతు న్నాయని తెలంగాణ బీడీ, సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ అన్నారు.

సంక్షోభంలో బీడీ పరిశ్రమలు..

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : బీడీ పరిశ్ర మలను సంక్షోభంలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టుతు న్నాయని తెలంగాణ బీడీ, సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మి క భవనంలో శనివారం తెలంగాణ బీడి సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్య క్షుడు శ్రీరాముల రమేష్‌చంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌వీ రమ బీడీ పరిశ్రమలపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బీడీ కార్మికుల సమస్యలపై యూనియన్‌ అధ్వర్యంలో సర్వేలు నిర్వహిం చి దశల వారీగా అందోళనలు, పోరాటాలు నిర్వహిం చాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ పరిశ్రమను పరిశ్రమపై ఆధార పడి పనిచేస్తున్న కార్మికులను సంక్షోభంలోకి నెట్టే విధం గా విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమా నికి సంబంధించిన సెస్‌ వెల్ఫేర్‌ బోర్డును రద్దు చేసిం దని, దీనివలన పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల సంక్షేమానికి నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు తాము అధికారంలోకి వస్తే జీవన భృతి రూ4వేల16 అందిస్తామ ని ఇచ్చిన హామీని అమలుచేయకుం డా కార్మికులకు అన్యాయం చేస్తోంద న్నారు. బీడీ కార్మికులకు నష్టం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్‌ పెన్షన్‌ను నెలకు 6వేల రూపాయలు అందించా లని, రాష్ట్ర ప్రభుత్వం జీవనభృతి 4 వేల 26 రూపాయలు అందించాలని తదితర డిమాండ్‌లతో జూలై 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తం గా అన్ని కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడు తామని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమాలలో బీడీ కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తెలంగాణ బీడీ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు మూషం రమేష్‌ జిల్లా కార్యదర్శి సూరం పద్మ యూని యన్‌ నాయకులు దాసరి రూప, జిందం కమలాకర్‌, బోనాల లక్ష్మి, గురజాల మమత పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:39 AM