ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:27 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాతో పాటు నగుదు తరలింపును సమర్థవంతంగా అరికట్టాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్‌బీగీతే పేర్కొన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాతో పాటు నగుదు తరలింపును సమర్థవంతంగా అరికట్టాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్‌బీగీతే పేర్కొన్నారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలో సర్ధాపూర్ శివారులో ఏర్పాటు చెక్‌పోస్ట్‌ను గురువారం సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణతో కలిసి తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్‌లను పరిశీలించారు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటివి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటినుంచి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో రూ.26లక్షల 70వేల నగదు సీజ్ చేయడం జరిగింద న్నారు. 10 కేసులలో 85. 695 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరి గిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా 80 కేసులలో 127 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటు న్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.