Share News

అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:11 AM

అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ అన్నారు.

అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలి

వేములవాడ టౌన్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ అన్నారు. శుక్రవారం వేములవాడ అర్బన్‌ పరిధిలోని సం కెపల్లి, శాత్రాజుపల్లి, కోనాయపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి చెక్‌ పోస్టులను ఆమె ఆకస్మిక తనిఖీ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యం లో నగదు, మద్యం, తరలించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల తనికీ ప్రక్రియ కట్టుదిట్టంగా చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి తనిఖీ వివరాలను స్ప్రష్టంగా రిజిస్టర్‌లలో నమోదుచేయాలన్నారు. ప్రతి తనిఖీని వీడియో రికార్డింగ్‌ చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్ర మత్తంగా ఉండి ఎన్నికల నియామవళిని ఖచ్చితంగా అమలు చేయాలన్నా రు. ఇప్పటివరకు తనిఖీ చేసిన వాహనాల వివరాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు ఉన్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:11 AM