Share News

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:12 AM

విద్యార్థులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండలాని, ర్యాగింగ్‌, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఎస్పీ మహేష్‌ బిగితే సూచించారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండలాని, ర్యాగింగ్‌, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఎస్పీ మహేష్‌ బిగితే సూచించారు. మంగళ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు. విద్యార్థులతో గంజాయి, ర్యాగింగ్‌కు వ్యతిరే కంగా ప్రతిజ్ఞ చేయించారు. వైద్య విద్యార్థులు గంజాయి, మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై స్కిట్‌ ద్వారా మి గతా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి సమాచారం నిజమని నమ్మవద్దని, తెలియని వ్య క్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌, మెసేజ్‌లు, అనుమా నాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కుటుంబ సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్‌ వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. సైబర్‌ నేరగాళ్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఉద్యోగ ప్రకటనలు, బహుమతుల ఆశలు, ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ , డిజిటల్‌ అరెస్ట్‌ తదితర మార్గాల్లో మోసాలకు పాల్పడే అవకాశం ఉంద ని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం, ఆన్‌ లైన్‌ వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే 1930 హెల్పలైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్‌కి గురైతే కళశాలలో ఏర్పా టు చేసిన యాంటీ ర్యాగింగ్‌ కమిటీ దృష్టికి తీసుకవెళ్లని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్‌కి పాల్పడితే చట్టపర మైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి

విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర నడిపే సమయాల్లో తప్పనిసరి గా హెల్మెట్‌ ధరించాలని, ట్రిపుల్‌ రైడింగ్‌, ర్యాష్‌డ్రైవింగ్‌ కు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలన్నారు. విద్యార్థినుల భద్రత కోసం జిల్లా షీ టీం పకడ్బందీగా పనిచేస్తుందని, ఎలాంటి వేధింపులు ఎదు రైనా షీ టీం నంబర్‌ 8712656425కు ఫిర్యాదు చేయాల న్నారు. ఈ సదస్సులో పట్టణ సీఐ శ్రీనివాస్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, అధ్యాపకులు, సైబర్‌ ఆర్‌ఎస్‌ఐ జునైద్‌, సైబర్‌ సిబ్బంది గంగారెడ్డి, మహేష్‌, కిట్టు, అభి షేక్‌, విజేయ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:12 AM