ఉమ్మడి జిల్లాలో బీసీలదే పైచేయి..
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:20 AM
రాష్ట్రప్రభుత్వం 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేనివేదిక ప్రకారంగా జిల్లామొత్తం జనాభా 10,10,469ఉండగా వీరిలో సగానికిపైగా బీసీలే ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రప్రభుత్వం 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేనివేదిక ప్రకారంగా జిల్లామొత్తం జనాభా 10,10,469ఉండగా వీరిలో సగానికిపైగా బీసీలే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు అత్యధి కంగా ఉన్నారు. బీసీ ముస్లిం మైనార్టీలు ఎస్టీజనాభా కంటే ఎక్కువగా ఉన్నారు. ఓసీ జనాభాలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువ శాతం ఉండగా ఆ తర్వాత వైశ్య జనాభా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా వెల్లడించిన జనాభా వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా జనాభాలో 63.69శాతం బీసీజనాభా ఉండగా ఇందులో ముస్లిం మైనార్టీలు 8.16శాతం మంది ఉన్నారు. ఎస్సీలు 20.66శాతం, ఎస్టీలు 1.31శాతం, ఓసీ జనాభా 14.34శాతం ఉంది. జిల్లాలో 3,37,526 నివాసాలు ఉండగా 63.24శాతం ఇళ్లు బీసీలవే ఉన్నా యి. ఎస్సీల ఇళ్లు 20.81శాతం ఉండగా ఎస్టీలకు 1.26శాతం, ఓసీలకు 14.69శాతం ఇళ్లు ఉన్నా యి. జిల్లాలో 2,08,786 మంది ఉన్న ఎస్సీ సామాజిక వర్గంలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీ జనాభాలో మాదిగలు 1,35,534 మంది ఉండగా 64.92శాతంతో సగానికిపైగా ఈ సామాజికవర్గంవారే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మాలలు 21.93 శాతంతో 45,795 మంది జనాభా కలిగిఉన్నారు. 2.97శాతం మాలసాలె, నేతకాని జనాభా 6,197 మంది ఉన్నారు. 8,522 మంది బేడ బుడగ జంగాలు 4.08 శాతం ఉన్నారు. గోసంగి జనాభా 2,501 ఉంది. 13,249మంది జనాభా కలిగిన ఎస్టీ సామాజికవర్గంలో 32ఉపకులాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఎరుకల కులస్తులు 7,484మంది(56.49శాతం), ఆ తర్వాత స్థానంలో 3,258 మంది లంబాడీలు (24.59 శాతం), 520 తోటిలు 3.92శాతం, 341మంది జనాభా కలిగిన చెంచులు (2.57శాతం) మంది ఉన్నారు.
ఫ బీసీల్లో 134ఉప కులాలు
జనాభాలో అత్యధికంగా 63.69శాతం కలిగిన బీసీ ల్లో ముస్లింమైనార్టీలతోపాటు 134ఉపకులాల ఉన్నా యి. వీరిలో 73,691మంది జనాభా కలిగిన ముది రాజ్‌లు(11.45శాతం), గౌడ కులస్తులు 68,830మంది జనాభా కలిగి 10.69శాతం ఉన్నారు. పద్మశాలీలు 67,626 మంది జనాభాతో 10.51శాతం, 65,603 మంది జనాభా కలిగిన మున్నూరుకాపులు 10.19 శాతం మందిఉన్నారు. 58,541మంది జనా భాతో యాదవులు 9.10శాతం ఉన్నారు. 31,652 మంది జనాభాకలిగిన కురుమలు 4.92శాతం ఉన్నారు. బీసీల్లో ముస్లింలు 56,375 మంది జనాభా (8.76శాతం) ఉంది. 17,162 మంది గోల్డ్‌స్మిత్ అవుసుల (2.67 శాతం), 16,335 మంది జనాభా కలిగిన కార్పెంటర్ వడ్రంగి (2.54), 7,146మంది బ్లాక్‌స్మిత్ కమ్మరి (1.11శాతం), 638మంది కంచర జనాభా, 241 మంది షిల్పి జనాభాఉంది. రజకులు 42031జనాభా (6.53 శాతం), 13,786మంది జనాభా కలిగిన నాయీ బ్రాహ్మణులు (మంగళి)(2.14శాతం) ఉన్నారు. 14,212మంది జనాభాతో కుమ్మరులు (2.21శాతం) ఉన్నారు. గంగపుత్ర బెస్తజనాభా 7,670మంది (1.19శాతం) ఉన్నారు. బీసీవడ్డెర 13,586 మంది2.11శాతం ఉన్నారు.
ఫ రెడ్డి జనాభా 52.99శాతం..
1,44,855 జనాభాతో 14.34శాతం ఉన్న ఓసీల్లో అత్యధికంగా రెడ్డీలు 52.99శాతం కలిగి ఉన్నారు. వీరి జనాభా 76,756మంది కాగా, ఆ తర్వాత 15.74శాతం కలిగిన వైశ్యుల జనాభా 22,798 మంది ఉన్నారు. వెలమలు 11,372మంది జనాభాతో 7.85శాతంతో ఉన్నా రు. 4.56శాతం కలిగిన కులం లేనివారు 6604 మంది ఉన్నారు. బీసీ-ఈలో లేని ముస్లిం మైనార్టీలు 15,437 మంది ఉండగా 10.66 శాతం ఉంది.
పెద్దపల్లిలో బీసీలు 4,97,186
ఫ మాదిగలు 1,56,020
ఫ ఓసీల సంఖ్య 58,712
ఫ ఎస్‌టీలు 16,884 మంది
ఫ మొత్తం జిల్లా జనాభా 7,28,802
ఫ గృహాల సంఖ్య 1,45,553
ఫ కులాల గణాంకాలపై ప్రజల్లో చర్చ
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే-2024 గణన చేపట్టింది. ఈ గణనపై పెద్దపల్లి జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపింది. బుధవారం రాత్రి నాలుగు విభాగాలుగా కుటుంబ సర్వే వివ రాలను ప్రభుత్వం వెల్లడించింది. పెద్దపల్లి జిల్లాలో కులాల వారిగా జనాభా, చదువులు, భూములు, ఇండ్లు, పెండ్లికాని వారి సంఖ్యలు, కులాంతర వివా హాలు, ఆర్థిక అసమానతలు వంటి వివరాలతో నివేదికలను సమగ్రంగా ప్రజల ముందుకు వచ్చాయి. ప్రధానంగా ఒక కులాల వారిగా వెల్లడించిన లెక్కలు జిల్లా లోని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 7,28,802 జనాభాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీల కుటుంబాలు, జనాభా లెక్కలను వెల్లడించారు. జిల్లాలో బీసీలు 4,97,186 మందిఅత్యధికంగా ఉన్నారు. ఓసీలు 58,712 మంది, ఎస్‌సీలు 1,56,020 మంది, ఎస్టీలు 16,884 మంది ఉన్నారు.
2023నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42శాతం రిజర్వే షన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదిమాసాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వే చేపట్టింది. ఈ సర్వే ఫలితాలను ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాలు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించారు. కానీ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమోదం లభించక పోవ డంతో రాష్ట్ర ప్రభు త్వం గత ఏడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్ని కలను, ఫిబ్ర వరి నెలలో మున్సి పాలిటీ ఎన్నికలను నిర్వహించింది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 42శాతా నికిపైగా బీసీలకు టికెట్లు ఇచ్చారు. అయితే అసెంబ్లీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల సంఖ్యను ప్రకటించినప్పటికీ జిల్లాల వారీగా కులాల వారీగా లెక్కలను బయట పెట్టలేదు.
ఈనెల15వ తేదీన ప్రభుత్వం ఆ లెక్కలను ప్రకటించింది. జిల్లాలో చేపట్టిన సమగ్ర ఆర్థిక, విద్య, ఉపాధి, కుల గణన సర్వే ప్రకారం
ఓసీలు జిల్లాలో 58,712మంది ఉన్నారు. ఇందులో రెడ్డిసామాజిక వర్గీయులు 26,650మంది, వెలమలు 7676మంది, వైశ్యులు 9548మంది, బ్రాహ్మణులు 3093మంది, ముస్లింలు, ఇతరులు ఉన్నారు.
బీసీలు 4,97,186మంది ఉండగా, ఇందులో అత్యధికంగా ముదిరాజ్ కులస్తులు 70,094 మంది, ఆతర్వాత యాదవులు 68,271మంది, మున్నూరు కాపులు 63,924 మంది, పద్మశాలి కులస్తులు 49,901, గౌడకులస్తులు 49,718మంది, రజకులు 26,010మంది, గంగ పుత్రు లు 12,624మంది, నాయిబ్రాహ్మణ కులస్తులు 7963మంది ఉన్నారు. విశ్వబ్రాహ్మణుల్లో గోల్డ్ స్మిత్ 8226మంది, కమ్మర 3955మంది, కంసాలి 132మంది, వడ్రంగులు 9233 మంది, శిల్పులు 93మందిఉన్నారు. కుమ్మర కుల స్తులు 10,512మంది, పెరిక కులస్తులు 14512మంది ఉన్నారు. మేరకులస్తులు 3857మంది, కుర్మ 19364మంది, దూదేకుల 8754మంది ఉన్నారు. బీసీల్లో షేక్‌లు 26291 మంది, దోభీముస్లిములు 869మంది ఉన్నారు.
ఎస్‌సీ కేటగిరీలో మొత్తం మంది 1,56,20 మంది ఉండగా, మాదిగలు 95,220 మంది, మాలలు 38,814 మంది, నేతకాని కులస్తులు 8336 మంది ఉన్నారు. ఎస్‌టీల్లోమొత్తం 16,884మంది ఉండగా, లంబాడాలు 8173మంది, ఎరుకలు 3632మంది, చెంచులు 465 మంది, కోయకులస్థులు 455మంది, ఇతరులు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 61.39శాతం బీసీలు
ఫ ఎస్సీలు 20.10శాతం..
ఫ ఎస్టీలు 4.89శాతం
ఫ జిల్లాలో పద్మశాలీలు అధికం..
ఫ తర్వాత మాదిగ జనాభా
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే -2024 గణన రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపింది. బుధవారం రాత్రి నాలుగు విభాగాలుగా కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కులాల వారీగా జనాభా, చదువులు, భూములు, ఇళ్లు చివరకు పెండ్లికాని వారి సంఖ్యలు, కులాంతర వివాహాలు, ఆర్థిక అసమానతలు వంటి వివరాలతో నివేదికలను సమగ్రంగా ప్రజల ముందుకు వచ్చాయి. ప్రధానంగా ఒక కులాల వారిగా వెల్లడించిన లెక్కలు జిల్లాలోని ప్రజలు ఆసక్తిగా గమనిస్తు న్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 19,2405కుటుంబాలు, 5,68,925 జనాభాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ,ఓసీల కుటుం బాలు, జనాభా లెక్కలను వెల్లడించారు. జిల్లాలో5.68లక్షల జనాభాలో బీసీలు (ముస్లిం మినహాయించి) 61.39 శాతం, ఎస్సీలు 20.10 శాతం, ఎస్టీలు 4.89శాతం ఉన్నారు. జనాభాలో అత్యధికంగా బీసీలుఉండగా అందులో పద్మ శాలీ సామాజికవర్గం వారు అధికంగా 70,468 మందిఉన్నారు. తర్వాత ఎస్సీలో మాదిగ సామాజికవర్గం వారు అధికంగా 67,166 మంది ఉన్నారు. ఓసీల్లో రెడ్డిలు 35,477 మంది ఎక్కువగా ఉంది.
ఫ బీసీల్లో పద్మశాలీలే ముందు వరుస..
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల్లో 134 ఉపకులాలు ఉన్నాయి. ముస్లింలను మినహాయించి బీసీకుటుంబాలు 1,17,914 కుటుంబాలు ఉండగా జనాభా3,46,866 మంది ఉన్నారు. జనాభాలో కుటుంబాలు61.39 శాతం, జనాభా 61.39శాతం ఉంది. బీసీల్లో ముస్లిం కుటుంబాలు 6,648కుటుంబాలు ఉండగా, జనాభా 21,997మంది ఉన్నారు. కుటుంబాలు 3.46శాతం, జనాభా 3.87శాతం ఉంది. బీసీల్లో పద్మశాలి కుటుంబాలు 19.34శాతంతో 24,091 ఉండగా, 19.10శాతంతో జనాభా 70468 మంది ఉన్నారు. బీపీ-ఏ లో అధికంగా రజక 5.85శాతంతో 7,282కుటుంబాలు, 5.83 శాతం తో 21,510జనాభా ఉంది. నాయిబ్రాహ్మణ కులాలకు సంబం ధించి 1.79శాతంతో 2234 కుటుంబాలు, 10.54 శాతంతో 38,871 జనాభా ఉంది. బీసీ-బీలో గౌడ కులస్తులు 10.69 శాతంతో1 3,313 కుటుంబాలు ఉన్నాయి. 10.54 శాతంతో 38,871 జనాభా, కుమ్మర 2.49 శాతంతో 3,097 కుటుంబాలు, 2.45 శాతంతో 9,046 జనాభా, కురుమ 3.31 శాతంతో 4,122 కుటుంబాలు,3.31 శాతంతో 12,216 జనాభా, వడ్రంగి 2.22 శాతంతో 2,760 కుటుంబాలు, 2.21శాతంతో 8,137 జనాభా ఉంది. బీసీ-సీలో 132 కుటుంబాలు ఇతర కులాల్లో కి మారిన వారు ఉన్నారు. బీసీ-డీలు ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ముదిరాజ్ 13.69 శాతంతో 17,050 కుటుంబాలు, 13.55 శాతంతో 49,964 జనాభా ఉంది. తర్వాత వరుసలో మున్నూరు కాపు 9.23 శాతంతో 11,503 కుటుంబాలు, 8.95 శాతంతో 33 వేల జనాభా ఉంది. యాదవ, గొళ్ల 10.39 శాతంతో 12,944కుటుంబాలు, బిసీ-ఈ లో షేక్‌లు 1.94 శాతంతో 2,416 కుటుంబాలు, 2.20శాతంతో 8,114 జనాభా ప్రధానంగా ఉంది.
ఎస్సీల్లో మాదిగల శాతమే అధికం
సమగ్ర సర్వేలో ఎస్సీ జిల్లాలో 20.09 శాతంతో 38,589 కుటుంబాలు ఉండగా,20.10 శాతంతో 1,14,180 జనాభా ఉంది. ఇందులో అధిక కుటుంబాలు, జనాభా మాదిగ సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. మాదిగలు 58.81 శాతంతో 22,694 కుటుంబాలు ఉండగా, 58.82శాతం 67,166 జనాభా ఉంది. తర్వాత మాల వర్గం 30.27శాతంతో 11,679 కుటుంబాలు, 29.84శాతంతో 34,071 జనాభా ఉంది. తర్వాత బేడ జంగం 4.75శాతంతో 1,832 కుటుంబాలు, 5.35 శాతంతో 6,112 జనాభా ఉంది.
ఎస్టీల్లో లంబాడా, బంజారాలే..
జిల్లాలో 4.26 శాతంతో 8178 కుటుంబాలు ఉండగా, 4.89 శాతంతో27780 జనాభా ఉంది. ఇందులో ప్రధానంగా లంబాడా, బంజారా, సుగాలి చెందిన 6457 కుటుంబాలు 78.96 శాతంగా ఉన్నాయి. 81.20 శాతంతో 22558 జనాభా ఉంది. తర్వాత ఎరుకల ఇతర ఉప కులాలు15.22 శాతంతో1245 కుటుంబాలు, 13.56 శాతంతో 3767 జనాభా ఉంది.
ఓసీలలో రెడ్డీలదే మెజార్టీ..
ఓసీలో 20 కులాల వరకు ఉన్నాయి. ఇందులో జిల్లాలో 10.80 శాతంతో 20746 కుటుంబాలు ఉండగా, 10.07 శాతంతో 57,170 జనాభా ఉంది. ఇందులో రెడ్డి కులస్తులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 62.81 శాతంతో 13,031 కుటుంబాలు ఉండగా, 62.06శాతంతో 35,477జనాభా ఉంది. వైశ్య, కోమటి 11.99 శాతంతో 2,488 కుటుంబాలు ఉండగా, 11.54 శాతంతో 6,597 జనాభా ఉంది. వెలమ 12.34 శాతంతో 2,560 కుటుంబాలు ఉండగా, 11.54 శాతంతో 6,597 జనాభా ఉండగా, బ్రాహ్మ ణులు 2.14శాతంతో 444 కుటుంబాలు, 2.34 శాతంతో 1,338 జనాభా, కాపు 1.37 శాతంతో 285 కుటుంబాలు, 12.83 శాతంతో 1,425 జనాభా ఉంది. ముస్లిం జనాభా 2.05శాతంతో 425కుటుంబాలు,2.49 శాతంతో 1,425 మంది ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల్లో 4.96 శాతం కుటుంబాలు కులం వివరాలను వెల్లడించలేదు. జిల్లాలో 20746 కుటుంబాలు వివరాలు తెలపగా 4.96శాతంతో 1030 కుటుం బాలు, 5.05శాతం 2888మంది వివరాలు వెల్లడించలేదు.
జగిత్యాలలో బీసీలు 71.13శాతం
ఫ జిల్లాలో 10,19,151 జనాభా
ఫ ఎస్సీలు 17.39 శాతం
ఫ ఓసీ జనాభా 8.52శాతం,
ఎస్టీలు 2.96శాతం
(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)
రాష్ట్రప్రభుత్వం సామా జిక, ఆర్థిక, కుటుంబ సర్వే వివరాలను వెల్లడిం చగా అందులో జగి త్యాల జిల్లాలో బీసీ జనా భా అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో మొత్తం జనాభా 10,19,151మంది ఉన్నారు. అందులో బీసీలు 7,24,866మంది ఉండగా మొత్తంజనాభాలో 71.13శాతం ఉంది. రాష్ట్రప్ర భుత్వం సమగ్రకుటుంబ సర్వేను 2024 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్థులు, వలసలు, ఇలా కీలక సమాచారం సేకరించారు. సంబంధించిన సమాచారాన్ని గత రెండురోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రప్రభుత్వం ఆయా కులాల వారీగా వివరాలను నిర్ణీత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. జిల్లాలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం స్పష్టమైంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసీ వరా ్గల్లో ఏకులం జనాభా ఎంతఉందనే గణాంకాలు బహిర్గతమయ్యాయి. సంబంధిత సమాచారంప్రకారం జిల్లాలో వందలాది కులాలు, ఉప కులా ల జనాభా,వాటిశాతం, సామాజిక, ఆర్థికస్థితి సూచికలు వెల్లడయ్యాయి.
ఫఎస్సీల్లో మాదిగలే మెజారిటీ..
జిల్లాలో ఎస్సీ జనాభాలో మాదిగలే మెజారి టీగా ఉన్నారు. జిల్లాలోని ఎస్సీజనాభాలో మాదిగలు 89,231మంది ఉండగా, 50.34 శాతం మాదిగ జనాభా ఉన్నట్లు తేలింది. స్థానంమాల, మాల అయ్యవారు 60,798 మంది ఉండగా, 34.30శాతం జనాభా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాలసాలె, నేతకాని వారు 7,375మంది ఉండగా 4.16శాతం జనాభా ఉన్నట్లు తేలింది. గోసంగి కులస్థులు 3,276 మంది ఉండగా 1.85శాతం జనాభా ఉన్నట్లు ప్రభుత్వం ప్రక టించింది. జిల్లాలో ఎస్సీ ఉప కులాలు 57ఉన్నాయి. ఇందులో అత్యల్పంగా చంచాల, బావురి, ఎల్గమాల్వర్, ఎల్ల మాల్వల్లు, గాసి, హెడ్డిరెల్లి, చంచండి, గోదారి, హోలియా, మాంగ్ గరోడి, సామా గారా, సంబన్, సప్రు, సిండోలు, చిందోలు, యాటాల, వల్లవన్ తదితర ఉప కులాలు ఉన్నాయి.
ఫఎస్టీల్లో లంబాడీలే సింహభాగం..
జిల్లాలో మొత్తం 30,212 ఎస్టీ జనాభా ఉంది. జిల్లామొత్తం జనాభాలో వీరి శాతం 2.96శాతం ఉంది. ఎస్టీల్లో సుగాలీలు, లంబాడీ, బంజారా ఉపకులాలకు చెందిన జనాభా 13,753 ఉంది. జిల్లా ఎస్టీ జనాభాలో లంబాడీ, ఇతరులు 45.52 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి స్థానంలో ఎరకుల కులస్థులు 4,275 మంది ఉన్నారు. జిల్లా ఎస్టీ జనాభాలో 15.64 ఉన్నట్లు తేలింది.
ఫబీసీల్లో పద్మశాలీలే అధికం..
జిల్లాలోబీసీల్లో పద్మశాలీలే అధికంగా ఉన్నారు. బీసీబీ కేటాగిరిలో పద్మశాలీ కులస్థులు 92,156మంది ఉన్నారు. జిల్లాలోని బీసీ బీ జనా భాలో పద్మశాలీలు 12.71ఉన్నట్లుగా తేలింది. తదుపరిస్థానంలో గౌడ కులస్థులున్నారు. జిల్లాలో గౌడకులస్థులు 55,366మంది ఉండగా 7.64 శాతం జనాభాఉంది. బీసీ ఈలో షేక్స్ 60,722మంది ఉన్నారు. వీరిశాతం 8.38గా ప్రభుత్వం ప్రకటించింది. అగ్నికుల క్షత్రియ, వడబలిజ, బెస్త, జాలరి, గంగపుత్ర జనాభా 40,077ఉంది. బీసీల్లోవీరు5.53శాతం గా ఉన్నారు. రజకకులస్థులు 36,730మందిఉన్నారు. జనాభాలో వీరు 5.07శాతంగా ఉన్నారు.
ఫఓసీల్లో సగానికి పైగా రెడ్డీలే...
జిల్లాలో ఓసీ జనాభాలో రెడ్డిలదే మెజారిటీ స్థానంఉంది. జిల్లాలో మొత్తం ఓసీలు 86,829 ఉన్నారు. జిల్లా జనాభాలో ఓసీలు 8.52 శాతం ఉన్నట్లుగా తేలింది. జిల్లాలోని ఓసీ జనాభాలో రెడ్డికులస్థులు 45,159 మంది ఉన్నారు. ఓసీకులస్థుల్లో రెడ్డిలు 52.01శాతంగాఉన్నారు. తర్వాత స్థానంలో కోమటి,వైశ్య,గుప్త,శెట్టి కులస్థులు 14,962మంది ఉండగా 17.23 శాతం ఉన్నట్లుగా తేలింది. జిల్లాలోని ఓసీల్లో వెల్మలు8,830మంది ఉండ గా, వీరిశాతం10.17గా లెక్కతేల్చారు. ముస్లింలు(బీసీ-ఈ కాకుండా) ఉన్నవారిజనాభా5,760గాఉంది.ఓసీజనాభాలో వీరు6.63శాతంగా ఉన్నారు.