Share News

మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:55 AM

స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పించక పోయినా పార్టీ పరంగా ఆ మేరకు టిక్కెట్లు ఇస్తామన్న మాటను నిలబెట్టుకొంది. అదేబాటలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు బీసీలకు ప్రాధాన్యమిచ్చాయి.

మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పించక పోయినా పార్టీ పరంగా ఆ మేరకు టిక్కెట్లు ఇస్తామన్న మాటను నిలబెట్టుకొంది. అదేబాటలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు బీసీలకు ప్రాధాన్యమిచ్చాయి. మొత్తం 124 డివిజన్లు, వార్డుల్లో 80 స్థానాల్లో బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం 3 గంటలకు ముగిసింది. ఆ లోపు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బీ ఫారాలు సమర్పించేందుకు గడువు విధించారు. దీంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు టిక్కెట్‌ ఇచ్చే విషయమై ఉత్కంఠతో ఎదురుచూశారు. ఎట్టకే లకూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలను అంద జేశారు. చివరి నిమిషంలో ఆయా మున్సిపాలిటీల్లో ఒకరిద్దరి అభ్యర్థుల పేర్లు మారాయి. జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 124 డివిజన్లు, వార్డుల్లో 80 స్థానాల్లో బీసీలకు 64.56 శాతం టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 36 సీట్లు కేటాయించగా, జనరల్‌కు కేటాయించిన 63 స్థానాల్లో బీసీలకు 44, ఎస్సీలకు 4 స్థానాలు, ఓసీలకు 13 టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ బాటలోనే బీఆర్‌ఎస్‌, బీజేపీలు బీసీ రిజర్వుడు స్థానాలు పోనూ జనరల్‌ స్థానాల్లో ఎక్కువగా బీసీలకే టిక్కెట్లు ఇచ్చారు.

ఫ రామగుండం కార్పొరేషన్‌లో 35 మందికి..

రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, 35 డివిజన్లలో 58.33 శాతం బీసీలకు టిక్కెట్లు ఇచ్చారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వు కాగా, 30 జనరల్‌ స్థానాల్లో 19 టిక్కెట్లు బీసీలకు కేటాయించారు. ఇం దులో బీసీలు వెంగళ బాపు, కంకణాల మౌనిక, సత్యప్రసాద్‌, వేగోళపు రుమాదేవి, బత్తిని స్వరూప, గడ్డం భాగ్యలక్ష్మి, అనుమ స్వరూప, దేవనపల్లి చక్రపాణి, బర్ల లక్ష్మి, సిరిశెట్టి సతీష్‌, అమ్రిన్‌ ఫాతిమా, పసుల రమాదేవి, స్వప్న ప్రియ, ఫజల్‌ బేగ్‌, పాతపెల్లి కావ్య, కౌటం సతీష్‌, బాల రాజుకుమార్‌, బొంతల సుకన్య, పాతపెల్లి ఎల్లయ్యకు పోటీలో ఉంటున్నారు. బీసీ రిజర్వుడు స్థానాల్లో మారంగుల రమేష్‌, బాబూమియా, చుక్కల లావణ్య, అమ్రిన్‌, స్వప్న హరిప్రసాద్‌, ఈసంపెల్లి అంజుల్‌, గడ్డం రమాదేవి, ఆడెపు భాగ్యలక్ష్మి, దాసరి సాంబమూర్తి, గన్ముక్కుల మహాలక్ష్మి, గట్ల రమేష్‌, కొమ్ము స్వప్న, మేకల హరికృష్ణ, సనా ఫకృద్ధీన్‌, మోతుపాటి స్వప్నకు టిక్కెట్లు ఇచ్చారు. ఇదే కేటగిరీలో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులు మడిపెల్లి విజయ, ధుళికట్ట సతీష్‌కు టిక్కెట్లు ఇచ్చారు. ఓసీ అభ్యర్థులు 9 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. మేయర్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు కాగా, డిప్యూటీ మేయర్‌ పదవికి బీసీ అభ్యర్థినే ఖరారు చేసే అవకాశం ఉంది.

ఫ పెద్దపల్లి మున్సిపల్‌లో 26 మందికి..

పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 26 వార్డుల్లో 72.22 శాతం బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారు. 13 స్థానాలకు బీసీలకు రిజర్వు చేయగా, 18 జనరల్‌ స్థానాల్లో 13 టిక్కెట్లు బీసీలకు ఇచ్చారు. ఇందులో పూరెళ్ల శైలజ, గుజ్జుల కుమార్‌, దొడ్డుపెల్లి జగదీష్‌, పాగాల శ్రీకాంత్‌, నాంసాని శ్రీకాంత్‌, తోట ఫణిందర్‌, బూతగడ్డ సంపత్‌, ఉప్పు స్వరూప, వునుకొండ జాహ్నవి, వునుకొండ సరస్వతీ, తిర్రి శ్రీలత, బూతగడ్డ స్వప్న, దేవనంది రమాదేవిలకు టిక్కెట్లు ఇచ్చారు. అలాగే బీసీ రిజర్వుడ్‌ స్థానాల్లో కొమ్ము సుదాకర్‌, కట్ట పద్మావతి, ఎండీ నాదీమ్‌, పూదరి అనూష, నెత్తెట్ల కొమురయ్య, బండి రమ్మకృష్ణ, నూగిళ్ల మల్లయ్య, తాడూరి శ్రీమన్నారాయణ, కొట్టె స్వరూప, తూముల లత, సాఽజిదా భాను, మంథని నర్సింగ్‌, అష్రఫ్‌ షరీఫ్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. జనరల్‌ కేటగిరీలో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులు ఎరుకల కల్పన, సుదిమల్ల అమ్రిష్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. 3 టిక్కెట్లు ఓసీలకు ఇచ్చారు. ఇక్కడ బీసీ అభ్యర్థుల్లో కాపు సామాజిక వర్గానికి 12 టిక్కెట్లు కేటాయించి పెద్ద పీట వేశారు. చైర్మన్‌ అభ్యర్థిగా అదే సామాజిక వర్గానికి చెందిన నూగిళ్ల మల్లయ్య పేరును ఖరారు చేశారు.

ఫ సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 12 మందికి..

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 12 వార్డుల్లో 80 శాతం బీసీలకు టిక్కెట్లు కేటాయించారు. బీసీలకు రిజర్వు అయిన 4 స్థానాలు పోనూ, జనరల్‌కు కేటాయించిన 8 స్థానాల్లో కూడా బీసీలకే టిక్కెట్లు ఇచ్చారు. ఒక్క ఓసీ కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులు గాజుల రాయమల్లు, నిషాత్‌ రఫీ, బిరుదు రాధాకృష్ణ, బాకం సాయి, తొర్రికొండ ప్రభాకర్‌, దున్నపోతుల లలిత, వేగోళం పద్మ గౌడ్‌, గాదాసు మంజుల, బీసీ రిజర్వుడ్‌ స్థానాల్లో ఈర్ల స్వరూప, గరిగె శోభారాణి, అంతటి పుష్పలత, సిద్ధ తిరుపతి పోటీ పడుతున్నారు. ఇక్కడ ముగ్గురు అత్యధికంగా ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు ఇచ్చారు. ఇక్కడి మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించినప్పటికీ బీసీలకే దక్కనున్నది. ఆ పదవి కాపు సామాజిక వర్గానికి చెందిన బిరుదు రాధాకృష్ణకు గానీ, గాజుల రాయమల్లు పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి.

ఫ మంథని మున్సిపాలిటీలో ఏడుగురికి..

మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉండగా, 7 వార్డుల్లో 53.84 శాతం టిక్కెట్లు బీసీలకు కేటాయించారు బీసీలు రిజర్వు చేసిన 3 స్థానాలు పోనూ, 7 జనరల్‌ స్థానాల్లో నలుగురు బీసీలకు టిక్కెట్లు కేటాయించారు. వారిలో శ్రీపతి బానయ్య, పోలు రజిత, జంబోజు సమ్మయ్య, నరెండ్ల విజయలక్ష్మి, బీసీ రిజర్వుడు స్థానాల్లో పెంటరి రాజు, వొడ్నాల శ్రీనివాస్‌, వేముల విజయలక్ష్మికి టిక్కెట్లు ఇచ్చారు. ఇక్కడి చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా, వొడ్నాల శ్రీనివాస్‌కు చైర్మన్‌ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Updated Date - Feb 04 , 2026 | 01:55 AM