పూలను పూజించే పండుగ బతుకమ్మ
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:25 AM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకో వాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకో వాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధ వారం రుద్రంగి మండల కేంద్రంలో సుమారు రూ.25లక్షలతో నాలుగు ప్రాం తాల్లో నిర్మించిన బతుకమ్మ ఘాట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతు కమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప పూల పండుగ అని, తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలను భావితరాలకు అం దించేలా వేడుకలను ఐకమత్యంతో నిర్వ హించుకోవాలన్నారు. మహిళలకు బతుక మ్మ నిమజ్జనం సందర్భంగా ఇబ్బందులు కలగకుండా ఘాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుప తి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.