బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:27 AM
బతుకమ్మ తెలం గాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలస్తుందని మున్సి పల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ తెలం గాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలస్తుందని మున్సి పల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 2వ వార్డు శాంతినగర్, 38వ వార్డు పద్మనగర్‌లో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించిన బతుకమ్మ ఘాట్లను ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బతుక్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రకృతి ఆరాధనకు నిద ర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు వేముల రాములు, రిక్కమల్లె రజితసంపత్ కుమార్, బుర్ర నారాయణ, గుండ్లపెల్లి నీరజపూర్ణచందర్, నెల్లుట్ల నరేష్, గెంట్యాల శ్యామలశ్రీనివాస్, బత్తుల రమేష్, మంచె రేణుక శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్ : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటలో నిర్మించిన బతుకమ్మ తెప్పను ఆదివారం మున్సి పల్ పాలకవర్గంతో కలిసి చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారం భించారు. వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలమల్లు, లింగంపల్లి భాగ్యలక్ష్మీసత్యనారాయణ, దొంతినేని కళ్యాణి అశోక్‌రావు,బుర్ర మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.