Share News

ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:43 AM

ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ.. తెలం గాణలో నిర్వహించే బతుకమ్మ అని స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ

వేములవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ.. తెలం గాణలో నిర్వహించే బతుకమ్మ అని స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని నిర్వహించే బతుకమ్మ వేడుకలో భాగంగా శుక్రవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయం నుండి బతుకమ్మ తెప్ప వరకు స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు లు అమ్మవారి ఊరేగింపులో ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూబతుకవ్ము సంబరాల నిర్వహణ కు రూ.34 లక్షలతో బతుకమ్మ పండుగకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, మూలవాగు వద్ద నిర్మించిన బతుకవ్మ తెప్ప వద్ద అమ్మ వారి ప్రతిమ ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండు గని, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించడం మన సంస్కృతిలో ప్రత్యేకమైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేములవాడలోని ఆడబిడ్డలకు పుట్టింటితో పాటు మెట్టినింటి ప్రాంతాల్లోనూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని గుర్తు చేశారు. పట్టణంలోని వార్డుల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఏర్పాట్లు చేశామని, విద్యుత్‌ దీపాలు, పారిశుద్యం, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యే క దృష్టి సారించామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కమిషనర్‌ లోకేష్‌, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు తూమ్‌ మధు, కాశ శ్రీనివాస్‌, ఐల శ్రీనివాస్‌, ఇప్పపూల మమత అజయ్‌, సిరిగిరి సంగీత-శ్రీకాంత్‌, అన్నారుపు శ్రీనివాస్‌, కొక్కుల బాలకృష్ణ, రామతీర్థపు కృష్ణవేణి-హరీష్‌, మూడపల్లి నీలమ్మ, కొండ రాజశేఖర్‌లతో పాటు నాయకులు కట్కూరి శ్రీనివాస్‌, పల్లపు రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:43 AM