Share News

సంబరంగా బతుకమ్మ వేడుకలు షురూ

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:16 AM

సంస్కృతి సంప్రాదాయలు ఉట్టిపడేలా ఆడపడుచులు అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగతో ఊరురా పూల జాతర మొదలైంది.

సంబరంగా బతుకమ్మ వేడుకలు షురూ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సంస్కృతి సంప్రాదాయలు ఉట్టిపడేలా ఆడపడుచులు అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగతో ఊరురా పూల జాతర మొదలైంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ శనివారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఎంతో సందడిగా ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం తొలి రోజు పూల పరిమళాలతో ఆడపడుచులు సందడి చేశారు. ప్రతి పల్లె నుంచి పట్టణందాకా ప్రతి గల్లీలోనూ మహిళల చప్పట్టు, గొంతుకల ఐక్యత బతుకమ్మ పాటలు గానం చేశాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో తీరొ క్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆట పాటల వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో తెలంగాణలోనే ప్రత్యేకంగా నిలిచిన బతు కమ్మ ఘాట్‌ వద్ద పురపాలకర సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలోని బీవైనగర్‌, గణేష్‌నగర్‌, తారకరామానగర్‌, వెంకంపేట, సర్దార్‌నగర్‌, అశోక్‌నగర్‌, పద్మనగర్‌, సంజీవయ్యనగర్‌, శాంతినగర్‌, అటోనగర్‌, సిద్ధార్థనగర్‌, రెడ్డివాడ, అంబే ద్కర్‌నగర్‌, విద్యానగర్‌, సాయినగర్‌, గీతా నగర్‌, శివనగర్‌, సుభాష్‌నగర్‌, నెహ్రూనగర్‌, గాంధీనగర్‌, గోపాల్‌నగర్‌, పెద్దబజార్‌, తదితర ప్రాంతాల్లో మహిళలు సామూ హికంగా బతుకమ్మ ఆట పాటలతో సంబు రంగా గడిపారు.

Updated Date - Oct 11 , 2026 | 12:16 AM