Share News

భీమన్న ఆలయంలో బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:18 AM

ఒక్కోసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములా యే చందమామ అంటూ బతుకమ్మ పాటల తో భీమన్న ఆలయ ఆవరణతో పాటుగా వేములవాడ పట్టణం మారుమోగిపోయింది.

భీమన్న ఆలయంలో బతుకమ్మ సంబరాలు

వేములవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒక్కోసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములా యే చందమామ అంటూ బతుకమ్మ పాటల తో భీమన్న ఆలయ ఆవరణతో పాటుగా వేములవాడ పట్టణం మారుమోగిపోయింది. ఎంగిలిపువ్వల బతుకమ్మ వేడుకలను పట్ట ణంతోపాటు, మండలంలోని ఆయా గ్రామా ల్లో మహిళలు అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామి ఆల యం తొలిసారి బతుకమ్మ వేడుకలకు వేదిక గా నిలిచింది. పట్టణ ప్రజలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుకుని, సాంప్ర దాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకు న్నారు. భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద బతుకమ్మలను పేర్చి బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ పాటులు పాడుతూ ఆటలు ఆడుతూ సంబ రాలు జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుక మ్మ సందర్భంగా బతుకమ్మలను నిమజ్జనం చేసి పుసుపుతోవాయినం ఇచ్చిపుచ్చుకున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన విప్‌..

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శనివారం పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా భీమేశ్వర స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హజరై బతుకమ్మ ఆడుతున్న మహిళలతో మాట్లాడా రు. భక్తులకు, పట్టణ ప్రజలకు బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆయన వెంట డీఈవో ప్రతాప నవీన్‌ కుమా ర్‌, ఏఈవో నాగుల మహేష్‌ ఉన్నారు.

పులకించిన మూలవాగు

వేములవాడ పట్టణంలోని మూలవాగు తీరొక్క పూలతో పులకించి పోయింది. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా పట్టణవాసులు మూలవాగులోని బతుకమ్మ తెప్పవద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 6 గం టల నుంచి పట్టణ కూడళ్లలో బతుకమ్మలు ఆడిన మహిళలు రాత్రి 9గంటల వరకు బతుకమ్మలతో మూలవాగుకు చేరుకున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో మూలవాగు ప్రాంతం పూల జాతరను తలపించింది. డీజే సౌండ్స్‌ మధ్య భక్తులు బతుకమ్మలు ఆడు తూ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకలను మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామ కృష్ణతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు.

Updated Date - Oct 11 , 2026 | 12:18 AM