Share News

రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:30 AM

జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందిం చడంతోపాటు అన్ని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను అందించి ఉపాధి రంగానికి చేయూతను ఇవ్వాలని బ్యాంకర్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు.

రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందిం చడంతోపాటు అన్ని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను అందించి ఉపాధి రంగానికి చేయూతను ఇవ్వాలని బ్యాంకర్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు. కలెక్టరేట్‌లోని సమా వేశ మందిరంలో గురువారం జిల్లా బ్యాంకర్‌ల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవ సాయం, గృహ, విద్య, రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్వయంఉపాధి పథకాలు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, స్వానిధి, స్త్రీనిధి పథకాల అమలు పురోగతి, వివిధ రంగాల అసంఘటిత కార్మికులకు బీమాపై బ్యాంకుల వారీగా కలెక్టర్‌ సమీక్షిం చారు. అనంతరం లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికలను విడుదల చేశారు. 2026-27 వ్యవసాయ, అనుబం ధ రంగాల రుణ లక్ష్యంగా రూ.3262 కోట్లు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.618 కోట్లు, విద్యా, గృహ, ఇతర రంగాలకు కలిపి రూ 148 కోట్లు అయా రంగాలకు కలిపి మొత్తం రూ.4029 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. వ్యవసాయ, విద్య, స్వయం ఉపాధి రుణాలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు రుణం ఇవ్వాలని ఆదేశించారు. ఆర్‌ సేథీ శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ, డైవ్రింగ్‌, మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న కోర్సులలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. శిక్షణ పూర్తి అయిన వారు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని ఆదేశించారు.

జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటు లోకి రావాలని సూచించారు. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్స్‌ సేవలు విస్తృతంగా అందించాలని ఆదేశించారు.

బీమా అందించాలి

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, వస్త్ర పరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికులు, మత్స్య ఇతర అసంఘటిత రంగ కార్మికులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. పీఎంఎస్‌ బీవై, పీఎంజేజేబీవై బీమా అందించాలని సూచించారు. బ్యాంక్‌లలో అందించే సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. 1930/1945టోల్‌ ఫ్రీ నంబర్‌పై వివరించాలని పేర్కొన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు..

జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవ కాశం ఉందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉందని, మరో రెండు యూనిట్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పిలుపు నిచ్చారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా, మత్స్య శాఖ ఇతర శాఖలు నాబార్డల వద్ద అందుబాటులో ఉన్న ఉపాధి, శిక్షణ సంబంధిత పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వ్యవసాయం, విద్య, స్వయంఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు బ్యాంకర్లు లక్ష్యం మేరకు ఇవ్వాలని సూచించారు. జిల్లా ఆర్థిక వృద్ధికి, స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాల కల్పనకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం మల్లికార్జునరావు, ఆర్బీఐ ఏజీఎం గోరేఖర్‌, నాబార్డ్‌ డీడీఎం దిలీప్‌, లీడ్‌ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ నటరాజ్‌, ఎస్‌బీఐ ఆర్‌ఎం పద్మజ, టీజీబీఆర్‌ ఎం రాజానరేంద్ర, ఆయా బ్యాంకుల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:30 AM