Share News

రుణాల పంపిణీకి బ్యాంకర్లు సహకరించాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:43 PM

ల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్థి స్థాయిలో సహకరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు.

రుణాల పంపిణీకి బ్యాంకర్లు సహకరించాలి

dకరీంనగర్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్థి స్థాయిలో సహకరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కేడీసీసీబీ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ, పీఎంజిపివై రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 84.55 శాతం రుణాలు పంపిణీ చేసేందుకు బ్యాంకర్లందరినీ జిల్లా కలెక్టర్‌ అభినం దించారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వందశాతం లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులు తమ రుణాలను రెన్యువల్‌ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికా రులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 2025 నుంచి డిసెంబర్‌ 2025 నెల వరకు రూ.11358.47కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లు త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణాల రికవరీపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపా లన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, అన్ని బ్యాంకుల అధికారులు, డీడబ్ల్యూఓ సరస్వతి, అడిషనల్‌ డీఆర్డీఏ సునీత, డీఆర్‌డీఓ, మెప్మా పిడీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:43 PM