Share News

బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - May 07 , 2026 | 11:59 PM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కౌన్సిలర్‌ స్థాయి నాయకుడిలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు

సిరిసిల్ల టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కౌన్సిలర్‌ స్థాయి నాయకుడిలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. సిరిసిల్లకు బండి సంజయ్‌ వస్తు న్నాడని పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేశా రని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ అహంకార పూరితంగా బీఆర్‌ఎస్‌ నాయకులను, ఉద్యమకారులను అనే క రకాలుగా కేసులు పెట్టి జైళ్లపాలు చేశారని అయినా ప్రభుత్వ కార్య క్రమాలను అడ్డుకున్నామని, నిరసనలు తెలియజేశామని, ప్రభుత్వాన్ని స్థంభింపజేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తమకు ఉద్యమా ల గురించి దాడుల గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని మీ దాడులను ఏవిధంగా తిప్పికొట్టాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలుసున్నారు. కేంద్ర మంత్రి అయిఉండి బండి సంజయ్‌ కౌన్సిలర్‌ స్థాయి నాయకుడి లా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎంపీగా, మం త్రిగా ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదని, ఒక రైల్వే లైన్‌, ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకురాలేదని ఆరోపించారు. మతం పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్నాడన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్‌ నీచమైన భాష మానుకోవాలని దమ్ముంటే నిజంగా కేంద్ర మంత్రివే అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోపిడీని అరికట్టాలని, కేటీఆర్‌ సవాలును స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. కాళే శ్వరం, ఫోన్‌ట్యాపింగ్‌, ఈ-కారు రేసుపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్టు చేయించాలనే బండి సంజయ్‌ కలలు కం టున్నాడన్నారు. ముందుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ దోపిడీ చేస్తు న్న రేవంత్‌రెడ్డి ముఠాని అరెస్టు చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజ ల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు కేటీఆర్‌ మాకుంటే బాగుండేదని ఇతర రాష్ట్ర ప్రజలు కోరకుంటున్నారన్నారు. మరోసారి బండి సంజయ్‌ చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తే రానున్న రోజుల్లో కౌన్సిల ర్‌గా కూడా గెలవడన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడారు. కేంద్ర సహా య మంత్రి బండి సంజయ్‌కి దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్‌నురాజకీ యంగా ఎదుర్కోవాలని సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటి చేయాలని సవాలు విసిరారు. అధికారం, అంగబలం ఉందని అనుచిత వ్యాఖ్యలు చేయడం, గూండాయిజం చేయడం మానుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కిందిస్థాయి నుంచి వచ్చినవారేనని దాడికి ప్రతిదాడి చేస్తామని హెచ్చ రించారు. సమావేశంలో నాయకులు గుండ్లపెల్లి పూర్ణచందర్‌, నంది శంకర్‌, కుంభాల మల్లారెడ్డి, కొండ శంకర్‌, మ్యాన రవి పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:59 PM