‘బక్రీద్’ను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - May 15 , 2026 | 11:56 PM
బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.
- ఎస్పీ అశోక్‌కుమార్
ధర్మపురి, మే 15 (ఆంధ్రజ్యోతి): బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ధర్మపురి మండలంలోని రాయపట్నం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను అదనపు ఎస్పీ చేతన నితిన, పోలీస్ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ చెక్ పోస్ట్ వద్ద భద్ర తా ఏర్పాట్లు, వాహనాల తనిఖీలు, రాత్రి పహారా విధులు, సిబ్బంది అప్రమత్తతను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లా డుతూ జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అన్నా రు. అనుమానాస్పద వాహనాలు, అక్రమరవాణా, చట్టవ్యతిరేక కార్యక లాపాలపై కఠిన నిఘా ఉంచాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, వదం తులను నమ్మకుండా భాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రతీ వాహనాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎస్పీ వెంట జగిత్యాల డీఎప్పీ పురుషోత్తంరెడ్డి, ధర్మపురి సీఐ రాంనర్సిం హారెడ్డి, ఎస్‌ఐ మహేష్, మండల పశువైద్యాధికారి డాక్టర్ దుంపల వేణుగోపాల్, వెటర్నరీ అసిస్టెంట్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బీర్‌పూర్: జిల్లాలో ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీ చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శుక్రవారం బీర్‌పూర్ మండలంలోని కమ్మునూర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును అకస్మికంగా తనిఖీ చేశారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా మరియు గోవధ నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. ఆయనవెంట డిఎస్పీ పురుషోత్తంరెడ్డి, ఎస్‌ఐ సబ్బని రాజు, సిబ్బంది ఉన్నారు.