బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:30 AM
అగ్రవర్ణ, భూస్వామ్య, పెత్తందారుల పాలనకు చరమగీతం పాడాలంటే బహుజన రాజ్యాధికారం కోసం ప్రతీ బహుజన బిడ్డ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన విశారదన మహారాజ్ పిలుపునిచ్చారు.
-బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన విశారదన మహారాజ్
గొల్లపల్లి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : అగ్రవర్ణ, భూస్వామ్య, పెత్తందారుల పాలనకు చరమగీతం పాడాలంటే బహుజన రాజ్యాధికారం కోసం ప్రతీ బహుజన బిడ్డ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన విశారదన మహారాజ్ పిలుపునిచ్చారు. గురువారం గొల్లపల్లి మండల కేంద్రంలో ఆయన మా భూమి రథయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో విశారదన మహారాజ్ మాట్లాడారు. బహుజనులంతా ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆయా వర్గాల బతుకుల్లో మార్పు రాలేదన్నారు. రాజ్యాధికారం బహుజనుల చేతుల్లో ఉంటేనే వారి బతుకుల్లో మార్పు వస్తుందన్నారు. పది శాతం లేని అగ్రవర్ణ పెత్తందారులు మనం వేసిన ఓట్లతో రాజ్యాధికారంలో శతాబ్దాల తరబడి ఊరేగుతుంటే 90 శాతం జనాభా ఉన్న బహుజనులు పాలితులుగానే మిగిలిపోవడం ఐక్యమత్య లోపమేనని, అవగాహన రాహిత్యమేనన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలు ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడలన్నారు. మన హక్కులు, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో మన వాటా మనకు అందేవరకు అంతకుముందు విశారదన మహారాజ్ రథయాత్రలో భాగంగా మండలకేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఆయా కాలనీల్లో సమస్యలపై కాలనీ వాసులు విశారదన మహారాజ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత, అధ్యక్షుడు మానాల కిషన, జిల్లా ఇనచార్జి దువ్వాక శివ, మండల బాధ్యుడు అశోక్, నాయకులు తిరుపతి, శ్రీనివాస్ చారి, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.