పంటల అవశేషాల దహనంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - May 25 , 2026 | 12:26 AM
పంటల అవశేషాల దహనంపై రైతులకు అవ గాహన కల్పించడంతోపాటు ఈనెల చివరిలోగా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదే శించారు.
సిరిసిల్ల అర్బన్, మే 24 (ఆంధ్రజ్యోతి) : పంటల అవశేషాల దహనంపై రైతులకు అవ గాహన కల్పించడంతోపాటు ఈనెల చివరిలోగా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదే శించారు. కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన వీడి యో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధాన్యం కొనుగోళ్లు, పొద్దు తిరు గుడు పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క మాట్లాడుతూ ఈ ఏడాది భారీస్థాయిలో వరి దిగుబడి వచ్చినా ఏ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల మంత్రివర్గం పొద్దుతిరుగుడు పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిం చాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరు గుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంట అవశేషాలను పొలాల్లో కాల్చ కుండా రైతుల్లో విస్తృతఅవగాహన కల్పించాలని ఆదేశించారు. పంట అవశేషాల దహనం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో టామ్‌టామ్ ద్వారా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి
ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం నిర్వ హించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా అఽధి కారులను ఆదేశించారు.జిల్లాల్లో వేడుకలు రోజు వారీగా ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యా చరణలో భాగంగా ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకా రం ఘనంగా నిర్వహించాలని మహిళా వారోత్స వాలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరి మ అగ్రవాల్ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం మే రకు కొనుగోలు చేయాలని స్పష్ట్టం చేశారు. వీడి యోకాన్పరేన్స్‌లో ఎస్పీ మహేష్ బీగీతే, సిరిసి ల్ల ఆర్డీఓ రాజేందర్‌రెడ్డి,డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, డీటీవో లక్ష్మణ్ కుమార్, డీసీఎస్‌వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీ ఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, మార్కెటింగ్ శాఖ అధి కారులు తదితరులు పాల్గొన్నారు.