అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:58 PM
వేసవిలో అధికంగా సం భవించే అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎస్పీ మహే ష్ బీగీతే కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో అధికంగా సం భవించే అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎస్పీ మహే ష్ బీగీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం అగ్నిమా పక వారోత్సవాల కరపత్రాలను అధికారులతో కలిసి ఎస్పీ ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజల ను చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ఉద్దేశమన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ, అగ్ని ప్రమాదాలు తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ఎస్‌ఎఫ్‌వో నరేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.