Share News

అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:47 AM

వేసవి కాలంలో అధికంగా సంభవించే అగ్నిప్ర మాదాలపై ప్రజల కు అవగాహన కల్పించి అగ్నిప్రమా దాలను నివారించా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి) : వేసవి కాలంలో అధికంగా సంభవించే అగ్నిప్ర మాదాలపై ప్రజల కు అవగాహన కల్పించి అగ్నిప్రమా దాలను నివారించా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల కు సంబంధించిన కరపత్రాలను ఆ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి 20తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వ హించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయ డం వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్‌లు, గ్యాస్‌నిల్వల గోదాములు, పెట్రోల్‌ బంక్‌లు, సినిమా హాళ్లు, పరిశ్రమలకు వెళ్లి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ, అగ్నిప్రమాదాలు తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశా రు. అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటలను అదుపులోకి తీసుకవ చ్చి భవనాల నుంచి ఎలా బయటికి రావడం, పొగనిండిన గదుల్లో నుంచి బయటపడడంపై తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌వో నరేందర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:47 AM