ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:55 PM
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి నిర్ధేశించిన సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి నిర్ధేశించిన సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరి సిల్ల కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం ఉద్యానవన, వ్యవ సాయ శాఖల అధికారులతోపాటు ప్రి-యునిక్ కంపెనీ, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో ఆయిల్‌పామ్ సాగు, పురోగతి, లక్ష్యాన్ని చేరుకోవడంపై కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2026-27ఆర్థిక సంవత్సరా నికి ఆయిల్‌పామ్ మొక్కలను నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగువల్ల రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగా హన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలన్నారు. అదేవిధంగా డ్రిప్‌ల ఏర్పాటు, మొక్కల సరఫరా ప్రక్రియల్లో జాప్యం లేకుండా సంబంధిత కంపెనీల ప్రతినిధు లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యా నవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా వ్యవసాయధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.
జలసిరి పనులను వేగవంతం చేయాలి
జలసిరి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలసాగు, పంటల వైవిధ్యం, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, జలసిరి కార్యక్రమాల అమలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా ల పురోగతి, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్పరేన్స్‌ను నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జడ్పీసీఈవో, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఏవో అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.