Share News

నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:00 AM

బాలింత లకు నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిం చాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వైద్యాధికారులను ఆదే శించారు.

నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పించాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : బాలింత లకు నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిం చాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వైద్యాధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లో బుధవారం నవజాత శిశువుల మరణాల నివారణ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్య నిపుణులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ నిర్వహించారు. గత మూడు నెలల్లో నవజాత శిశువుల మరణాలు, కార ణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జనరల్‌ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ నవజాత శిశువుల మరణాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపారు. జిల్లాలో మరణాలు సున్నా శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. గర్భిణులకు క్రమం తప్పకుండా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. బీపీ, షుగర్‌, రక్త పరీ క్షలు, ఇతర వైద్య పరీక్షలు క్రమంతప్పకుండా చేయాల ని సూచించారు. అందరి వైద్య పరీక్షల వివరాలు భద్రప ర్చాలని స్పష్టం చేశారు. గర్భిణులతో అవసరమైన వ్యా యామం, యోగా ఆసనాలు వేయించాలని, నార్మల్‌ డెలి వరీతో లాభాలు తెలియజేస్తూ ప్రోత్స హించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నార్మల్‌ డెలివరీలు ఎక్కువ సంఖ్యలో అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. బాలింతలు అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం, ఇతర జాగ్రత్తలపై వైద్యులు, సిబ్బంది అవగాహ న కల్పించాలన్నారు. అలాగే పుట్టిన బిడ్డను మొదటి గంటలోగా తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. నెలలు నిండని, తక్కువ బరువు తో పుట్టిన నవజాత శిశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. లింగ నిర్ధార ణ పరీక్షలు చేయడం నేరమని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఈ సమా వేశంలో జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, డీసీ హెచ్‌ఎస్‌ రవీం దర్‌, మెడికల్‌ ఆఫీసర్లు, గైనకాలజిస్ట్‌, పిల్లల వైద్య నిపు ణులు, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:00 AM