సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:55 PM
గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువ తకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసు కురావాలి ఎస్పీ మహేష్ బి గితే అధికారులకు సూచించారు.
రుద్రంగి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువ తకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసు కురావాలి ఎస్పీ మహేష్ బి గితే అధికారులకు సూచించారు. రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, విధుల నిర్వహణ తీరును పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవ లందించాలని, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహణ ను మరింత పటిష్ఠం చేయాలని, అలాగే రౌడీషీటర్లు, గంజాయి, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠి న చర్యలు తీసుకోవాలని సూచించాను. ప్రజలకు గంజాయి వలన కలిగే అనర్థాలపై, సైబర్ నేరాలపై, రోడ్డు ప్రమాదలపై అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని ఆదేశించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్‌ఐ మోతిలాల్, సిబ్బంది ఉన్నారు.