వెట్టిచాకిరి, కార్మిక హక్కులపై అవగాహన
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:08 AM
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు అందుబాటు లో ఉన్న సహాయ వ్యవస్థల గురించి తెలిజేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు అందుబాటు లో ఉన్న సహాయ వ్యవస్థల గురించి తెలిజేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు. కలెక్టరేట్‌లో గురువారం వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘స్వేచ్ఛారథం’ ప్రచార వాహ నాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వెట్టిచాకిరి నిషేధానికి పకడ్బందీ చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. వెట్టిచాకిరికి గురైన బాధితులను గుర్తించడం, రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అవసరమైన సహాయాన్ని అందించడం వంటి అంశాలల్లో జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుం దని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, వెట్టిచాకిరికి సంబంధించిన ఘటనలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు సమా చారం అందించాలని సూచించారు. బాధితులకు సహాయం అందించేందు కు ప్రభుత్వం ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343 గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక శాఖ అఽధికారి కృష్ణసాగర్, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్, కార్మిక సంఘాల నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.