సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:42 AM
సైబర్ నేరాలకు ప్రజలు గురికాకుండా అవగా హన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయాలని, అలాగే నకిలీ కస్ట మర్ కేర్, పెట్టుబడి మోసాలు, స్ర్కీన్ షేరింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : సైబర్ నేరాలకు ప్రజలు గురికాకుండా అవగా హన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయాలని, అలాగే నకిలీ కస్ట మర్ కేర్, పెట్టుబడి మోసాలు, స్ర్కీన్ షేరింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సైబర్ నేరా ల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు రూపొందించిన పోస్టర్‌లను పోలీసులతో కలిసి ఎస్పీ మహేష్ బీగితే ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ వ్యాప్తంగా సైబర్, ఆర్థిక నే రాల నివారణ, సురక్షిత డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల మొత్తంలో యువర్ మనీ, యువర్ క్లిక్, యువర్ చాయిస్, అనే ప్రధాన ఇతివృత్తం నివా దంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రస్తుత డిజిట ల్ యుగంలో సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధ తులను అనుసరిస్తూ ప్రజలను ఆర్థిక మోసాల కు గురిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండా లని సూచించారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే ముందు క్షణం ఆగి, డబ్బులు స్వీకరించే వ్యక్తితో పాటు ఆ సంస్థ వివరాలను పూర్తిగా ధ్రువీకరిం చుకోవాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రకటనలతో వస్తువులు, సేవలందిస్తామని నమ్మించి డబ్బు లు వసూలు చేసి మోసాలకు పాల్పడటం, వ్యక్తి గత వివరాలను దొంగిలించి క్రెడిట్, డెబిట్ కార్డు లను అనధికారికం గా వినియోగించ డం వంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సూచించా రు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను నమ్మి సంప్రదించ వద్దని, ప్రతి కస్టమ ర్ కేర్ నంబర్ నిజ మైనదని భావించ వద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో సైబర్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, సైబర్ సిబ్బంది పాల్గొన్నారు.