డ్రగ్స్‌తో నష్టాలపై అవగాహన
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:39 PM
డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థా లు, నష్టాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగా హన కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితేలు ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థా లు, నష్టాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగా హన కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితేలు ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదువుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గం జాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు శాఖల వారీ గా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ విని యోగం వల్ల కలిగే నష్టాలపై చేయాల్సిన విస్తృత ప్రచారం,డీఅడిక్షన్ కేంద్రంలో వైద్య సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితేలు మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొ ని అమలు చేయాలని సూచించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టా లపై పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించా రు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దుకాణాల్లో తనిఖీ చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల కు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలని, డీఅడిక్షన్ సెంటర్‌లో జిల్లా వైద్యాధికారిని ఆదేశించా రు. అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూము లు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే పోలీస్ అధికారులకు స మాచారం అందించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, పైవ్రేటు కళాశాలల్లో డ్రగ్స్ వాడ కంతో కలిగే అనర్ధాలు, ఇబ్బందులపై అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, జిల్లా వైద్యా ధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, జిల్లా విద్యాధికారి విజయ్‌సాగర్, ఇంటర్ విద్యాధికారి శరత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేష్, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, ఫుడ్ ఇన్ స్పెక్టర్ అనూష, వ్యవసాయ, కార్మిక, అట వీశాఖ అధికారులు పాల్గొన్నారు.