ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:17 AM
ఎల్‌నినో ప్రభావం, ప్రత్యా మ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులతోపాటు ఆరోగ్య సమస్యలపై ప్రజలతోపాటు రైతులకు అవగా హన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం, ప్రత్యా మ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులతోపాటు ఆరోగ్య సమస్యలపై ప్రజలతోపాటు రైతులకు అవగా హన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి సంబంధిత అధికారులతో కలిసి ఎల్‌నినో ప్రభావంపై రూపొందించిన పోస్టర్‌లను ఆవి ష్కరించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ పోస్టర్లు, కరపత్రాలను జిల్లాలోని ప్రతి గ్రామానికి చేర్చాలని, అన్ని అంశాలపై అవగా హన కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది కరపత్రాలు అందరికీ పంపిణీ చేయాలని సూచించారు. ప్రత్యా మ్నాయ పంటలు పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ జలసిరి కింద ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్ వెల్స్ రీచార్జ్ పనులు ముమ్మరంగా చేయించాలని తెలిపారు. భూ గర్భ జలాల లభ్యత, భవిష్యత్తు అవసరాలపై రైతులకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పిం చి.. ప్రోత్సహించాలని సూచించారు. పంట కుంటలు (పామ్ పాండ్), ఊట కుం ట(పర్కొలేషన్ ట్యాంక్)లను పూర్తిచేయాలని ఆదేశించారు. వాన నీటిని సంరక్షిస్తే భవిష్యత్‌లో ఎంతో మేలు చేకూరుతుందని, భూ గర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. డెంగ్యూ, మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తమ ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఈ పోస్టర్‌ల ఆవిష్కరణలో ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రెటరీ శ్రీని వాస్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ ఉన్నారు.
అటవీ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి
జిల్లాలోని అటవీ భూములు కబ్జాకు గురికాకుండా సంరక్షణకు పక డ్భందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అదేశించారు. కలెక్టరేట్‌లో మంగళ వారం రాత్రి అటవీ భూముల సంరక్షణ, కబ్జాల నివారణ, వనమహో త్సవం, సర్వే, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్, అటవీశాఖ, రెవెన్యూ భూము ల అంశాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అటవీభూముల సంరక్షణ కు అటవీశాఖ అధికారులు పకడ్భందీ చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. భూములు కబ్జా కాకుండా సాగు చేయకుండానిరంతరం పర్యవే క్షణ చేయాలని స్పష్టంచేశారు. కబ్జాకుగురైన భూములను వెనక్కి తీసు కుని అటవీశాఖ భూముల్లో వన మహోత్సవం కింద పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని అదేశించారు. అటవీ భూములకు సంబంధించిన సర్వేను సర్వే అండ్ ల్యాండ్ రికార్స్డ్ అధికారులు పూర్తిచేసి హద్దులు నిర్ణయించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, అర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వేయర్ శ్రీనివాస్, ఎఫ్‌అర్‌వో నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.