Share News

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:02 AM

ప్రసుత్త వానాకాల సీజన్‌లో ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ఎల్లారెడ్డిపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రసుత్త వానాకాల సీజన్‌లో ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో నులి పురుగుల నివారణపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ మాట్లాడుతూ నులి పురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈనెల 13న 19 ఏళ్లలోపున్న వారికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించాలన్నారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రే డేను నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, యువజన, మహిళ సంఘాలను సమన్వయపరిచి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల న్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నాగేంద్రబాబు, రామకృష్ణ, రాంరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సారియా అంజుం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:02 AM