మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:52 AM
మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహేష్ బీ గీతే కోరారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహేష్ బీ గీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఆదివారం అధికారులతో కలిసి ఎస్పీ మాదక ద్రవ్యాల అవగాహన వారో త్సవాలకు సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. పోలీస్ అధికారు లు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ ఈగల్ టీం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పప రిణామాలపై విద్యార్థులు, ప్రజలకు వారంరోజుల పాటు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, విని యోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్ర చారి, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.