ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - May 20 , 2026 | 12:14 AM
ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ సూచించారు. కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది.
కరీంనగర్ టౌన్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ సూచించారు. కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. కరీంనగర్‌లోని ఆటో డ్రైవర్లకు మంచిపేరు ఉందని, ఇలాగే డ్రైవర్లందరూ సత్ప్రవర్తనతో ఉండేందుకు ఆటో సంక్షేమ సంఘం డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధ్యక్షుడిగా బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండారు సంపత్‌పటేల్, కోశాధికారిగా చిట్లిమల్ల నాగభూషణం, ఉపాఽధ్యక్షులుగా కొత్తూరి సత్యనారాయణ, ఇరవేని కుమార్, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కుకట్ల సంపత్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.