Share News

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిక..

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:46 PM

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిక..

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 4 (ఆంంధ్రజ్యోతి) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో శనివారం బోటిమీదిపల్లె సర్పంచ్‌ గౌరవేని శ్రీవాణిసుమన్‌, ఉపసర్పంచ్‌ లతికనరేష్‌లతో పాటు వార్డుసభ్యులు పార్టీలో చేరగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారందరు కాంగ్రెస్‌ నిబంధనకులకు అనుగుణంగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ పట్ల నమ్మకంతో అనేక మంది బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో వార్డుసభ్యుడు పర్శరాం, ముదిరాజ్‌ సంఘ అధ్యక్షుడు దురుముట్ల రాములు, నాయకులు గొడుగు నర్సింగం, దుర్గయ్య, రాజయ్య, దేవయ్య, లచ్చయ్య, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, సర్పంచులు మామిడి రాజు, మంజులరమేష్‌, కాత మల్లేశం, అరుకాల నవీన్‌, నేరెళ్ళ విజయ్‌లతో పాటు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:46 PM