Share News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే యత్నాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:34 AM

ఓట్‌ చోరీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు యత్నాలు జరుగుతు న్నాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే యత్నాలు

వేములవాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓట్‌ చోరీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు యత్నాలు జరుగుతు న్నాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ఢిల్లీ రాంలీలా మైదానంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్య లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను మోచేతి కింద పెట్టుకుని, ఓటు హక్కును అపహాస్యం చేస్తు న్న బీజేపీ పాలకుల అహంకారానికి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపి స్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అంతిమ నిర్ణయాధికారి అని, ఓటరు గొంతుకోసే దారుణమైన కుట్ర జరుగుతోందని వివరించారు. ఓటరు జాబితాలోంచి పేర్లు మాయం చేస్తూ గెలవాలని చూస్తోందన్నారు. వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధు కౌన్సిలర్లు కొండ రాజశేఖర్‌, ఐల శ్రీనివాస్‌ నాయకులు సంగ స్వామి యాదవ్‌, బీరెడ్డి సల్మాన్‌ రెడ్డి, పల్లపు రాజేందర్‌, సిరిగిరి శ్రీకాంత్‌, మూడపల్లి నాగరాజు, సిర్రం పర్శరాములు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:34 AM