Share News

ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:46 AM

కొన్ని అరాచక శక్తులు వెన కాల ఉండి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కాం గ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నాలు

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : కొన్ని అరాచక శక్తులు వెన కాల ఉండి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కాం గ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను కాంగ్రెస్‌ నాయకులు సందర్శించారు. డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావు, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌తో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడారు. సమ్మె మూలంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అనంతరం స్థానిక కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం వద్దకు కాంగ్రెస్‌ నాయకులు చేరుకొని వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడారు. కార్మికుల 32 డిమాండ్లకు ప్రభుత్వం 29 డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందన్నారు. వేతనాలు చెల్లించలేని ఆర్థిక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దెనెక్కిందని అందరికి తెలుసన్నా రు. అయినా కూడా ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ అన్యాయం చేయాలనే అలోచన ప్రభుత్వంకు లేదన్నారు. కొన్ని అరాచశక్తులు ప్రభుత్వాన్ని బద నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రభుత్వం వస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ నాగుల సత్యనారా యణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, పీసీసీ మాజీ కార్య దర్శి గడ్డం నర్సయ్య, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాగుల జగన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ నక్క నర్స య్య, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:46 AM