Share News

క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:01 AM

జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయసాగర్‌ అన్నారు

క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రీడాకారులను పరిచయం చేసుకున్న డీఈవో విజయ్‌సాగర్‌, తదితరులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయసాగర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీల ముగింపు ఉత్సవానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా క్రీడాకారులను ముందు వరుసలో నిలిపేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ ఆఫీసర్‌ కె అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌ బన్సీలాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని 22 పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్థులు, 70 మంది ఫిజికల్‌ డైరెక్టర్లు, కోచ్‌, మేనేజర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. కబడ్డీ క్రీడాంశంలో విజేతలుగా నిలిచిన జట్టు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పీఎంశ్రీ పాఠశాలల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్లకు ప్రాతనిధ్యం వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌, అంతటి శంకరయ్య, కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్‌, జిల్లా వాలీబా్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గిన్నె లక్ష్మణ్‌, రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్‌ రిఫరీస్‌ బోర్డు కన్వీనర్‌ వంగపల్లి సూర్యప్రకాష్‌, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ పోటీల విజేతలు...

ఖో-ఖో బాలుర విభాగంలో జీహెచ్‌ఎస్‌ ధన్గర్‌వాడి ప్రథమ , టీజీఎంఎస్‌ గంగాధర ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో టీజీఎంఎస్‌ గంగాధర ప్రథమ , టీజీఎంఎస్‌ గన్ముకుల ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాలీబాల్‌ బాలుర విభాగంలో టీజీఎంఎస్‌ ఎలగందల్‌ ప్రథమ, టీజీఎంఎస్‌ రుక్మాపూర్‌ ద్వితీయ, బాలికల విభాగంలో టీజీఎంఎస్‌ గంగాధర ప్రథమ, టీజీఎంఎస్‌ ఎలగందల్‌ ద్వితీయ స్థానాలు సాధించాయి. కబడ్డీ బాలుర విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ గన్నేరువరం ప్రథమ, టీజీఎంఎస్‌ గంగాధర ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో ఎంజేపీ తిమ్మాపూర్‌ ప్రథమ, టీజీఎంఎస్‌ గంగాధర ద్వితీయ స్థానంలో నిలిచాయి.

Updated Date - Oct 25 , 2026 | 12:01 AM