ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:15 AM
: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు 48 గంటల ధర్నా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ సమస్యల పరిష్కారానికి రాత్రిపూట కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీుని అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాల్వ సారిక, ఉపాధ్యక్షులు పద్మ, రజిత, సరిత, లత, జిల్లా సహాయ కార్యదర్శులు సుమలత, శ్యామల, సరోజన, లావణ్య, సుమ పాల్గొన్నారు.