ఆర్టిజన్ కార్మికుల నిరసన ర్యాలీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:21 AM
ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా మంగళవారం ఆర్టిజన్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
గణేశ్‌నగర్,ఏప్రిల్14(ఆంధ్రజ్యోతి): ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా మంగళవారం ఆర్టిజన్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్ నోటీస్ అందజేశారు. ఈ సందర్బంగా టీవీఏఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని అన్నారు. అన్‌మ్యాన్‌డ్ ్డ కార్మికులను విలీనం చేసుకోవాలన్నారు. యజమాన్యం టర్మినేషన్ కాపీ రద్దుచేసి కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర కో కన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, ఎండి అలీఖాన్, సయ్యద్ కరీముద్దీన్, సయ్యద్,సిరాజ్, బాబాఖాన్ హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గుగులోతు శివకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సమ్మెకు ఆర్టిజన్, అన్‌మ్యాన్‌డ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.