Share News

‘అరైవ్‌-అలైవ్‌’ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:28 AM

అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలు పోలీస్‌, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా మిగతా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశించారు.

‘అరైవ్‌-అలైవ్‌’ పకడ్బందీగా నిర్వహించాలి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలు పోలీస్‌, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా మిగతా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలపై గురువారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితేలు హాజరయ్యారు. సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడు తూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మన దేశం లోనే జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, రోడ్డు వెంట ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో మృతిచెందుతున్నారని వెల్లడించారు. ప్రజా సంక్షేమం, భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలుచేస్తుందని వివరించారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్ర మాలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నియ మాలు అందరూ పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించ డం సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కు పక్కా చర్యలు తీసుకోవాలని, బ్లాక్‌ స్పాట్స్‌, ప్రమాద జంక్షన్లు గుర్తిం చాలని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ, స్కూల్‌ బస్‌, ఆటో డ్రైవర్లకు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద సైన్‌ బోర్డు లు, స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదా రులు హెల్మెట్‌ ధరించాలని, కార్లలో సీటు బెల్ట్‌ పెట్టుకునేలా అవగాహ న కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్‌ సేఫ్టీ కమిటీని 8 నుంచి 9 మందితో ఏర్పాటు చేయాలని, దానిలో విరమణ పొందిన ఉద్యోగులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ఉండేలా చూడాల ని సూచించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలి : కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో షెడ్యూల్‌ ప్రకారం అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహించే అరైవ్‌ అలైవ్‌ వీక్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించా రు. గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏమైనా ఉంటే గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిది ద్దాలని పేర్కొన్నారు. హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పించాలని, తప్పకుండా ధరించేలా చూడాలని సూచించారు. డ్రైవర్లకు కంటి పరీ క్షలు, సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ కుమార్‌, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దిన్‌, ఆర్టీసీ డిపో మేనేజర్లు ప్రకాశరావు, శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:28 AM