Share News

వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:56 PM

నీట్‌ పరీక్ష లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా సంస్థల బంద్‌ చేపట్టారు.

వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

భగత్‌నగర్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా సంస్థల బంద్‌ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కళాశాలలు సెలవు ప్రకటించగా కొన్ని చోట్ల పాఠశాలలు బంద్‌ పాటించాయి. బంద్‌లో భాగంగా కరీంనగర్‌లో యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యాలయాన్ని ముట్టడి చేందుకు కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా బయలు దేరారు. ఎంపీ కార్యాలయం సమీపంలోకి చేరుకోగానే యుఎస్‌ఎఫ్‌ఐ నాయకు లను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో యుఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎన్‌టీఏను రద్దు చేసి నీట్‌ పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేష్‌ పటేల్‌, బ్రాహ్మణపల్లి యుగేందర్‌లు డిమాండ్‌ చేశారు. బంద్‌లో భాగంగా కరీంనగర్‌లోని బాలికల జూనియర్‌ కళాశాలను బంద్‌ చేశారు. అనంతరం పోలీసులు బంద్‌లో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు.

ఫ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ సందర్భంగా ఏస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శులు గజ్జెల శ్రీకాంత్‌, మచ్చ రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని ప్రధాని మోదీకి బినామీగా పనిచేస్తోందని ఆరోపించారు. అరెస్టయిన వారిలో ఏఐఎస్‌బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక రాజశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపల్లి అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:56 PM