Share News

భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:18 AM

రాజన్న ఆలయానికి, అనుబంధ ఆలయాలకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు భక్తిభావాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారుల కు సూచించారు.

భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాటు చేయాలి

వేములవాడ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : రాజన్న ఆలయానికి, అనుబంధ ఆలయాలకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు భక్తిభావాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారుల కు సూచించారు. రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనృసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకు లు ఆశీర్వచనం అందించి శ్రీస్వామి వారి ప్రసా దాన్ని అందజేశారు. అనంతరం నాంపల్లి గుట్ట పై వీటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీ కరణ పనులను క్షేత్రస్థారులో పరిశీలించారు. గుట్టపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏ ర్పాటు చేసేందుకు ఇప్పటికే ఇక్కడికి తరలించా రని, విమానం ఏర్పాటు చేసి, ఇతర సుందరీకర ణ పనులు కొనసాగించాలని, గడువులోకగా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.వేములవాడ పట్ట ణంలోని సినారె కళామందిర్‌ ఆవరణ లోపలి వైపు పరిశీలించారు. సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. సినారె కళామందిర్‌ సుందరీకరణకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు సిద్ధంచే యాలని అధికారులను ఆదేశించారు. వెంట ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, కమిషనర్‌ లోకేష్‌, తహసీల్దార్‌ జయంత్‌, ఎంపీడీవో ఉన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:18 AM