Share News

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:12 AM

స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

సుభాష్‌నగర్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌హాలులో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ వెంటరమణతో కలిసి వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రొటోకాల్‌ సమస్య తలెత్తకుండా నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదిక వద్ద సీటింగ్‌, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. స్టాల్స్‌, శకటాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అంబులెన్స్‌, ఫైరింజన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, పార్కింగ్‌లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రశంసాపత్రాలు అందించేందుకు ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను ఎంపిక చేయాలని సూచించారు.

Updated Date - Aug 07 , 2026 | 12:12 AM