Share News

క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:41 AM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను ప్రో త్సహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

వేములవాడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను ప్రో త్సహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కబడ్డీ అసో సియేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌కు హజరైన ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చే అవ కాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో క్రీడల అభివృద్దికి సంబంధించి వివిధ బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. 2008 సంవత్సరంలో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్న సమ యంలో క్రీడలకు సంబంధించి అవార్డు అందించిన విష యాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్థారు క్రీడా పోటీల నిర్వ హణలో భాగంగా వాలీబాల్‌ పోటీలను కరీంనగర్‌లో విజ యవంతంగా నిర్వహించామన్నారు. క్రీడాకారులకు వస తి, భోజనం అందించేందుకు కళ్యాణ మండపాలు, ఇతర అనువైన వేదికలను సిద్దం చేశామన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ సూచించిన మెనూ ప్రకారం భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తమ ప్రాంతానికి వచ్చిన క్రీడాకారులను అతిథులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:41 AM