Share News

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 15 , 2026 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సభను ఈనెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభకు ఏర్పాట్లు

సిరిసిల్ల అర్బన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సభను ఈనెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి సభ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశా న్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించి సభ లో అందజేయాలన్నారు. లబ్ధిదారుల అభిప్రాయాలను అందరికి వివ రించాలన్నారు. మంత్రి, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబం ధిత శాఖల అధికారులు, స్వయంసహాయక సంఘాల సభ్యులు, యువ త, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించా రు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. సభలు తెలంగాణ రాష్ట్ర గీతం (జయ జయహే తెలంగాణ) స్వాగతోపన్యాసం, పరిచయం అలాగే సీఎం సందేశం వినిపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి (200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, సన్న రకం వరికి బోనస్‌, చేయూత పెన్షన్లు, కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌, ఇందిరా మహిళా శక్తి బ్యాంక్‌ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్‌ కార్డుల లబ్ధిదారుల వివరాలు సాధించిన విజయాలపై శాఖల ద్వారా సమాచారం ఇవ్వాలని, లబ్ధిదారుల పేర్లను చదవాలని, లబ్ధిదారుల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాలని తెలిపారు. ఇప్పటిదాకా అమ లుచేస్తున్న వాటిపై చర్చించాలని, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై తీర్మానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

18 నుంచి పర్యాటక శాఖ, యువజన వారోత్సవాలు

పర్యాటక శాఖ, యువజన వారోత్సవాలు ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. ఈనెల 18వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2కే రన్‌ నిర్వహణకు ఏరాట్లుచేయాలని తెలిపారు. ఈనెల 21వ తేదీన షెడ్యూ ల్‌ ప్రకారం ప్లేఅండ్‌ పార్టిసిపేట్‌ స్పోర్స్‌ డేలో భాగంగా సమ్మర్‌ క్యాంప్‌ కార్యక్రమాలకు హాజరవుతున్న పిల్లలతో స్పోర్స్‌ డే కార్యక్రమాలు నిర్వ హించాలని సూచించారు. ఈనెల 22న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, అదేరోజు జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, 23న మెగా జాబ్‌ మేళా చేపట్టాలని, మిగతా కార్యక్రమాలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసా చారి, ఉపాధికల్పన అధికారి రాఘవేందర్‌, యువజన క్రీడల శాఖ అధి కారి రాందాస్‌, పరిశ్రమల శాఖ అధికారులు హనుమంతు, భారతి, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:15 AM