పొద్దుతిరుగుడు పంట సేకరణకు ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:25 AM
పొద్దు తిరుగుడు పంటను సేకరణకు అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : పొద్దు తిరుగుడు పంటను సేకరణకు అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం మార్క్‌ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో పొద్దు పంట సేకరణపై సమీ క్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో పొద్దుతిరుగుడు పంట 1700 ఎకరాల్లో సాగు చేశారని వెల్లడించారు. ఈ పంట కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కొనుగోలు కోసం కావాల్సిన సామగ్రి, వేయింగ్ యంత్రాలు అన్ని ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. క్వింటాల్ పొద్దు తిరుగుడుకు రూ.7721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు దీర్ఘకాలం పాటు ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. దీంతో అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని తెలిపారు. సన్న రకం ధాన్యం పండించేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మద్దతు ధర, బోనస్ ఇతర లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల విస్తరణపై అధికారులకు సమాచారం ఇవ్వాలి
జిల్లాలో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్న శాఖల అధికా రులు టీఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు తప్పనిసరిగా సమా చారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి జిల్లా స్థాయి టెలికాం కమిటీ (డీఎల్టీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిజి టల్ భారత్‌నిధి, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, టెలికాం టవర్ లకు విద్యుత్ సరఫరా, భారత్ నెట్ ఇన్ర్ఫ్, కాల్ బీ ఫోర్ యూ డీజీ మొబైల్ అప్టికేషన్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు చేపడు తున్న సందర్భంగా అయా శాఖల అధికారులు తప్పనిసరిగా టీఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఅర్‌డీవో గీత, టీఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, మిషన్ భగీరథ అధికా రులు పాల్గొన్నారు.