రాజన్న సన్నిధిలో శివకల్యాణోత్సవానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:55 AM
వేముల వాడ రాజరాజేశ్వ రస్వామి దేవాలయంలో ఈనెల 5 నుంచి 9వరకు నిర్వహించే శివ కల్యాణోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
వేములవాడ టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ రాజరాజేశ్వ రస్వామి దేవాలయంలో ఈనెల 5 నుంచి 9వరకు నిర్వహించే శివ కల్యాణోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాజన్న ఆల య ప్రధాన ద్వారం ఎదుట ఉన్న రావిచెట్టు వద్ద యాగశాలను సిద్ధం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈనెల 5నుంచి 9వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ శివ కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఈనెల 6న జరుగనున్న పార్వతీపరమేశ్వరుల దివ్య కల్యాణో త్సవాన్ని పార్కింగ్ స్థలంలో నిర్మించిన శివార్చన వేదికపై నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈ శివార్చన వేదికపై ప్రత్యేకంగా విశాలమైన కల్యాణవేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8న వేము లవాడ పురవీధుల్లో రథోత్సవం నిర్వహించేందుకు రూప కల్పన చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు : ఈవో
రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిర్వహించే శివ కల్యాణోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆల య ఈవో ఎల్. రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాల యంలో ఉద్యోగులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు రోజుల్లో శివకల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నా రు. ఆలయ ఇంజనీరింగ్ విభాగం, ఆలయ అర్చకులు, ఉద్యో గులు, సంబంధిత విభాగాల సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి శివకల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆల యానికి భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నం దున వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏరాపట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రధానంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీటీ సౌకర్యం, పారిశుధ్య పనులు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శివకళ్యాణోత్సవాలను భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంపొందించేలా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావే శంలో ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మహి పాల్‌రెడ్డి, ఏఈవోలు శ్రావణ్‌కుమార్, జయకుమారి, శ్రీని వాస్‌శర్మ, వెల్ది సంతోష్, నూగూరి నరెందర్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.