Share News

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:32 PM

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లుకు అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు సీఎంఆర్‌ డెలివరీపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు.

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లుకు అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు సీఎంఆర్‌ డెలివరీపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు. కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ డెలివరీపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావే శాన్ని నిర్వహించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఐకేపీ 123, పీఏసీఎస్‌ 122, మెప్మా ఆధ్వర్యంలో 2, మొత్తం 251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే 2025-26 ఖరీఫ్‌, యాసంగి సీజన్‌ సీఎంఆర్‌ డెలివరీపై దృష్టి సారించాలని సూచిం చారు. పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యం దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి డెలీవరీలో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బే గం, సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:32 PM